కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్- వన్ ఎలెక్షన్‌కు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికలో ఇచ్చిన సూచనల మేరకు తొలి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో దేశం మొత్తం నిర్ణీత వ్యవధిలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Post Views: 24