రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజా భవన్ కు పిలుపునిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకుపుట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా రైతులను, రైతు సంఘాల నాయకులను ఎక్కడిక్కడ పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తూ వారిపై కక్ష తీర్చుకుంటున్నది.
రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన రైతన్నలను అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య. బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.
అరెస్టులు చేసిన రైతులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
మాది ఆంక్షలు లేని ప్రభుత్వం, కంచెలు లేని ప్రభుత్వం, ప్రజా పాలన అంటూ డబ్బా కొట్టుకునే రేవంత్ రెడ్డి ఇదేంది?
ప్రజా భవన్ చుట్టూ ఎందుకు ఇన్ని బ్యారెకేడ్లు, ఎందుకు ఇన్ని ఆంక్షలు?
ప్రజాభవన్ కు రైతులు తరలివస్తున్నారంటే సీఎంకు ఎందుకు అంత భయం?
రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా మొదలైన రైతుల ఉద్యమాన్ని ఎదుర్కోవడం అంటే.. రాజకీయంగా వెకిలి మకిలి, చిల్లర వ్యాఖ్యలు చేసినంత సులువు కాదు.