★మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష
వెల్దుర్తి మండలం నేటి గద్దర్ సెప్టెంబర్ 19.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉన్న సిబ్బందిపై అసభ్యంగా మాట్లాడిన, దురుసుగా ప్రవర్తించిన విధులకు ఆటంకం కలిగించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న వారితో ఇతర వ్యక్తులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష అన్నారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న వారితో వచ్చిన అటెండర్లు సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. వైద్యం చేయించుకుంటున్న వ్యక్తులతో ఒక్కరు మాత్రమే అటెండర్ గా ఉండాలని ఇతర వ్యక్తులు వచ్చి ఇతర పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలక్కుండా సహకరించాలని ఆమె అన్నారు. ఎవరైనా సిబ్బందిపై దాడి చేస్తే మాత్రం తప్పనిసరిగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆమె అన్నారు.