*నేటి గద్దర్ న్యూస్ గుండాల*; చట్టాలను పటిష్టంగా అమలుపరచాలని మంగళవారం తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసి తదనంతరం ఆదివాసి సంక్షేమ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర,పూనేం రమణబాబు మాట్లాడుతూ, గుండాల మండల కేంద్రంలోకి విచ్చలవిడిగా వలస వచ్చి వలస గిరిజన నేతరలను తిరిగి వారి సొంత స్థలాలకు పంపిచ్చుట మరియు 1/70 1/59 భూ బదలాయింపు చట్టాలను పూర్తిగా అణచివేస్తూ, 2018 పంచాయతీరాజ్ చట్టం భూ లేఅవుట్ నిబంధనల ప్రకారం ఏటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వలస గిరిజననేతర బహుళఅంతస్తుల నిర్మాణాలను తొలగించి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ భూమిని క్రయవిక్రయాలు జోరుగా జరుపుతున్న వారిపై తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకుని స్వాధీన పరుచుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల కమిటీ సభ్యులు కోడెం రమేష్ పూనేం వసంత్ గోగ్గేలా సుధాకర్ జబ్బ సుదర్శన్ చింత శ్రీను రామారావు పూణెం రాజేందర్ బాబురావు లిపిన్ రామ్మూర్తి రాజు సుమన్ తదితరులు పాల్గొన్నారు.