వికారాబాద్ జిల్లా , దామగుండం అడవి ప్రాంతంలో విఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టు నిర్మాణం ని వెంటనే నిలిపివేయాలని, ఉస్మానియా యూనివర్సిటీ లో సొందే అన్సర్ దొర మరియు అశోక్ కుమార్ గడ్డమీది* అధ్యక్షతన నిరసనలో ” *సేవ్ ట్రీస్, సేవ్ ఫ్యూచర్* ” అని విద్యార్థులు నినాదాలు చేశారు.
సుమారు 2900 ఎకరాల అటవీ మరియు 12 లక్షల చెట్లు తొగించే అవకాశం ఉంది . అయితే తెలంగాణ కు మధ్య ప్రాంతంలో ఉన్న ఈ అటవీ హైదరాబాద్ కు ఊపిరితిత్తుల లాంటివి . ఇలాంటి ప్రకృతిక విధ్వంశాల వల్ల భవిష్యత్తు తరాలు చాలా నష్టపోతారని తెలియజేశారు.
అయితే , ఈ ప్రాజెక్ట్ ఫారెస్ట్ కన్సర్వేషన్ చట్టం కి పూర్తి విరుద్ధంగా గా ఉంది అని , దీని వల్ల అడివిలో జీవించే జంతులు మరియు వృక్షాలు అంతరించడమే కాకుండా పర్యావరణానికి చాలా ప్రమాదం పొంచి ఉంటుంది అని విద్యార్థుల నాయకులు మహిపల్ , హరికృష్ణ , శ్రీను , కిరణ్ మరియు ఇతర విద్యార్థులు ఆందోళన వెక్తం చేశారు .