.
నేటి గద్దర్ కరకగూడెం: బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ మాట్లాడుతూ గతంలో బిఅర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు కేసీఆర్ కిట్టు ప్రసూతి అయిన మహిళలకు అమ్మాయి పుడుతే 13000 వేల రూపాయలు అబ్బాయి పుట్టుతే 12000 వేల రూపాయలు మద్యతరగతి కుటుంబాలని ఆడుకోవడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఈరోజు వరకు గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఆర్థిక సహాయం అందించకపోవడం చాలా దారుణం అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లేనియెడల ప్రజల తరఫున ప్రతిపక్షాన పార్టీగా దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో చిరుమళ్ళ మాజీ సర్పంచ్ పాయం. నరసింహరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నిట్టా.ఏడుకొండలు చొప్పాల మాజీ సర్పంచ్ బోడా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.