+91 95819 05907

స్నేహానికి చేయూత :మిత్రుడి దశాదిశా కర్మలకు ఆర్థికనికి అండగా నిలిచినా స్నేహితులు.

*స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అని నిరూపించిన మృతుడి చిన్ననాటి మిత్రులు…*
అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు గ్రామానికి చెందిన ఆకిటి హనుమంత రెడ్డి, శైలజ దంపతుల పుత్రుడు ఆకిటి రాజశేఖర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర వార్తతో మల్లెల మడుగు జడ్పీఎస్ఎస్ హై స్కూల్ 2005-2006 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన స్నేహితులందరిలో తీవ్ర విషాదం నిపింది. పాఠశాల రోజుల్లో ఏర్పడిన స్నేహబంధం, కాలం గడిచినా ఆ అనుబంధంగా కొనసాగుతోందని ఈ సందర్భం మరోసారి రుజువైంది.

స్నేహితులందరూ మిత్రుడి మృతి వార్త అందరిలో విషాదన్ని నింపింది మృతి చెందిన మిత్రుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఉందని తెలుసుకొని ఆ కుటుంబానికి ఎలాగైనా మద్దతుగా నిలవాలని సంకల్పించారు. కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యాన్ని చెప్పే ఈ స్నేహ బంధం, రాజశేఖర్ కుటుంబాన్ని ధైర్యవంతులుగా నిలిపేందుకు ముందుకు వచ్చింది. వారు తమ బాధను పక్కన పెట్టి, దశాదిశా కర్మలకు మన స్నేహితుడు కుటుంబానికి తమ తోచిన సహాయం చేయండి అని వారి వాట్సప్ గ్రూప్ ద్వారా మిత్రులందరికీ సమాచారం అందించారు
( దాదాపుగా 65 వేల రూపాయలు పోగు చేశారు )

స్నేహితులు కేవలం పరామర్శనే కాకుండా స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఇది కేవలం సహాయం కాకుండా స్నేహానికి ఉన్న ఆప్యాయతను చిహ్నంగా. స్నేహితుల సహకారం, వారి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో ఈ సంఘటన మరోసారి రుజువు చూపించింది. స్నేహబంధం కేవలం ఆనంద సమయాల్లోనే కాకుండా, కష్టకాలాల్లో కూడా ఒక బలమైన సహాయంగా నిలుస్తుందని ఈ సందర్భం నిరూపించింది.

2005-2006 బ్యాచ్ స్నేహితులు తమ పూర్వ స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మానసికంగా, ఆర్థికంగా మద్దతుగా నిలవడమే కాకుండా, తమ మధ్య ఉన్న స్నేహబంధం ఎంత విశ్వసనీయమైనదో రుజువు చేసింది . ఈ బంధం ఎప్పటికీ నిలిచి ఉండాలని, దాని విలువలు స్నేహితులందరూ గౌరవిస్తారని ఈ సందర్భం తెలుపుతోంది.
ఈరోజు తమ స్నేహితుడి దశదిన కర్మలకు అందుబాటులో ఉన్న మిత్రులు హాజరై ఆ మొత్తాన్ని మృతి చెందిన తన మిత్రుడి కుటుంబానికి అందజేశారు

ఈ సమయంలో స్నేహితుల అందించిన సహాయం, వారి వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా, సమాజానికి ఇచ్చే ఒక స్నేహమేరా జీవితం అనే సందేశాన్ని కూడా తెలియజేస్తోంది. స్నేహం అనేది ఏ కాలంలోనూ ఆత్మీయతను, గౌరవాన్ని కోల్పోకుండా నిలిచే బంధమని ఈ సంఘటన మళ్లీ నిరూపించింది.
తన మిత్రుడి చిత్రపటానికి చివరిసారిగా ఘన నివాళులు అర్పించారు…
మిత్రుడు లేకున్నా మిత్రుడి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని మాట ఇచ్చారు…

ఇది కదా స్నేహం అంటే…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

 Don't Miss this News !