– ఎంపీడీవో జమాల్ రెడ్డి
బూర్గంపాడు ః బూర్గంపాడు మండల పరిధిలో గల సారపాక పట్టణంలో స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఐటీసీ వావ్ సంస్థ (ఈశ్రీ – ఫౌండేషన్ ) ఆధ్వర్యంలో విద్యార్థులతో పాస్టిక్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మసీద్ రోడ్డు నుంచి సెంటర్ వరకు విద్యార్థులతో ప్లాస్టిక్ ఫ్రీ సమాజం పై ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవహారం నిర్వహించి, అధికారులు, విద్యార్థలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బూర్గంపాడు మండల ఎంపీడీవో పాల్గోని మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించుకోవాలని ఆయన అన్నారు.స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుండి అక్టోబర్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమా లలో భాగంగా బుధవారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన అన్నారు.స్థానిక బస్ షెల్టర్ వద్ద మానవ హారం గా నిలచి పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత అవశ్య కతపై నినాదాలు చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం తోని అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశు భ్రతలో భాగస్వా ములు కావాలని ఈ సందర్భంగా ఎంపీడీవో జమాల్ రెడ్డి తెలిపారు. చెత్తా చెదారాలను వీధుల్లో వేయకుండా పారి శుద్ధ్య కార్మికులకు అందించాలని, అపరి శుభ్రత వలన రోగాల బారిన పడాల్సి వస్తుందన్నారు. ఇళ్ల లోని తడి పొడి చెత్త లను వేరువేరుగా చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలన్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ నివారణకు ప్రత్యామ్నాయాలను వినియోగించుకో వాలన్నారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ కార్య క్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగల్ రావు, ఐటీసీ వావ్ సంస్థ బాధ్యులు రమ్య, సౌజన్య, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.