రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో విఆర్ఏల జీవో నెంబర్ 81, 85 ప్రకారం 65 ఏళ్లకు పైబడిన మా కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ మండల తహసీల్దార్ రజని కుమారి,కి విఆర్ఏలు బుధవారం నాడు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎలను రెగ్యులర్ చేస్తూ సత్వర నియామకాల కోసం జి.ఓ. ఎం.ఎడ్.నెం.8123 ప్రకారం 37147 మంది 61 ఏళ్లు పైబడిన మా కుటుంబ వారసులకు ఉద్యోగ నియామము కోసం టీవోలు బధిలీ చేయబడ్డయన్నారు.గత 10 నుండి 12 సంవత్సరాలుగా సేవలందిస్తున్నామని అన్నారు. ఉన్నత విద్యార్హతలు కలిగి సేవలను ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము ముందుండి ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు.గ్రామపంచాయతీలు వచ్చినప్పటి నుండి 61 ఏళ్లు పైబడిన విర్ఎలు 203 మంది మరణించారు.అలాగే 14 నెలలుగా 2005 మంచి విఆర్ఎలు చేయవలసిన విధులను 37107 మంది మాత్రమే నిర్వహిస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో గల 3757 మంది 61 ఏళ్లు పైబడిన విఅర్ఎలకు ఉత్తర్వులు ఇవ్వనందువల్లన మా ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారి ఎంతగానో కుంగిపోతున్నామని పేర్కొన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా యందు మానవీయ కోణంలో దయతలచి రూ 3791 మంది 61 ఏళ్ళకు పైబడిన విఆర్ఎ వారసులకు M.L.నెం. 81, 85 ప్రకారం నియామక ఉత్తర్వులు జారీచేసి ఉద్యోగాలు కల్పించి మా కుటుంబ సభ్యులను అదుకోవాలని కోరుతున్నారు.