నేటి గద్దర్ హుకుంపేట న్యూస్,
హుకుం పేట మండల కేంద్రం లో సి.పి.ఎం మండల కార్యాలయం లో సి.పి.ఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి. అప్పల నరస మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు కేటాయింపు విధానం ఆదివాసీ చట్టాలను ప్రభుత్వం ఉల్లంఘించింది. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి మద్యం దుకాణాలు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 వ షెడ్యూల్డ్ ప్రాంతల్లో సుమారు 46 మండలాలు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉందని, మరికొన్ని మండలంలో పాక్షిక ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రకటించిన మద్యం దుకాణాలు కేటాయింపు విధానం ఆదివాసీ హక్కులు, చట్టాలను ఉల్లంఘించడం దారుణం. పీసా గ్రామ సభ ఆమోదం లేకుండ మద్యం దుకాణాలు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధం. 2011 లోనే పీసా నిబంధనలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉల్లంఘించింది.గ్రామ సభ కు మాత్రమే సంపూర్ణ అధికారం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా లో 40 మద్యం దుకాణాలకు సుమారు 2300 దరఖాస్తు, పార్వతీ పురం మన్యం జిల్లా పరిధిలో 30 ప్రభుత్వ మద్యం దుకాణాలకు 2400 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడ గిరిజనేతరులు బినామీ పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్టం లో ఉన్న వారుకూడా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో మద్యం దుకాణాలు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ కావాలని పీసా చట్టాలను ఉల్లంఘించడం, పీసా ఎన్నికల్లో నిర్వహించకుండా వాయిదాలు వేస్తూ మద్యం దుకాణాలు కేటాయింపు ప్రక్రియ ప్రారంభించడం అన్యాయం. గత ప్రభుత్వం కన్న బిన్నంగా నూతన ప్రభుత్వ పాలన అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆచరణ లో మాత్రం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదివాసీ హక్కులు ఉల్లంఘన పై ప్రతి పక్ష పార్టీలు, ముఖ్యంగా వైసీపి ఎమ్మెల్యే లు , ఎంపి లను ప్రజలు గెలిపిస్తే కనీసం స్పందించడం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, అనంతగిరి జెడ్పీటీసీ దిసారి గంగరాజు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సొంటేన హైమ వతి,పార్టీ మండల కార్యదర్శి,మెరకచింత మాజీ సర్పంచ్ వలసనైని లక్ష్మణ రావు, మండల వైస్ ఎంపిపి సుడిపల్లి కొండల రావు, మండల నాయకులు,కొంతిలి వైస్ సర్పంచ్ డూరు కృష్ణా మూర్తి,నాయకులు తమార్బ అప్పల కొండ పడల్ తదితరాలు పాల్గొన్నారు.