*
మాసాయిపేట మండలం (భూపాల్) నేటి గద్దర్ నవంబర్ 17.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలోని రాఘవేంద్ర రైస్ మిల్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు వచ్చిన దాన్యం వెనువెంటనే దిగుమతి చేసుకొని లారీలను తిరిగి రైస్ మిల్లులకు తరలించాలని యజమానులకు సూచించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని అంగడిపేట లో నిర్వహిస్తున్న ఆర్థిక సామాజిక సర్వే కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు పకడ్బందీగా సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆర్థిక సామాజిక సర్వేలో పాల్గొనాలని సూచించారు.