మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ హైదరాబాద్ సర్వీస్ పై డ్రైవింగ్ చేస్తున్నాడు ప్రయాణికురాలు ఓ చంటి పాపతో ప్రయాణం చేస్తుంది.. తన వ్యక్తిగత అవసరాలు నిమిత్తం సూర్యాపేట బస్టాండ్ లో కాసేపు ఆమె దిగగా ఆ చిన్నారిని చూసే వారెవరు లేకపోయారు. దీంతో డ్రైవర్ ఆ చిన్నారిని ఆలన పాలన ఇలా చూసుకోవడంతో చూపరులను ఆకట్టుకుంది. చిన్నారి తల్లి తిరిగి రావడంతో మరల ఆ శిశువుని ఆమెకి అప్పగించారు.
ఆర్టీసీ ఉద్యోగులు గమ్య స్థానాలకు చేర్చడంలోనే కాదు సహాయం చేయడంలో ముందుంటారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ వేదికగా ఆ డ్రైవర్ ని అభినందించారు.
Post Views: 46