నేటి గదర్ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ మాపై నమ్మకంతో మాకు అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టినందుకు మిగతా సర్పంచులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు. అలాగే మా తోటి సర్పంచులకు ఏ సమస్యలు వచ్చిన తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ గ్రామ పంచాయతీల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని వారు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఉపాధ్యక్షులకు మండల అధికారులు వివిధ సంఘాల నాయకులు ప్రజలు వివిధ పార్టీల నాయకులు అభినందనలు తెలియజేశారు.
Post Views: 47








