**
పాల్గొన్న పలు గ్రామాల రైతులు
నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి
(భూపాల్ మాదిగ) మార్చి 17.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక లో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా మండల కేంద్రంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం కింద మండలంలోని బొమ్మరం, హక్కింపేట గ్రామాలు ఎంపికైనట్లు ఏఈ కవిత తెలిపారు. ఎంపికైన 250 మంది రైతులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి, ఉన్నతాధికారులు సాగు మెళకువలను సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో రజిత, రైతులు పాల్గొన్నారు.
Post Views: 28








