నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
– సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు క్యాంప్ కార్యాలయంలో అందరికీ అందుబాటులో.
ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ రోజు (గురువారం) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు, పుర ప్రముఖులకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
Post Views: 18