నేటి గద్దర్ కరకగూడెం: మండల పరిధిలోని చొప్పాల గ్రామం నందు సారలమ్మ తల్లి జాతర సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం,ములుగు రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగిశాయి.ఈ టోర్నమెంట్లో 50 టీములు పాల్గొనగా సారలమ్మ టీం,నర్సాపూర్ టీములు ఫైనల్ చేరాయి.శుక్రవారం జరిగిన నువ్వా నేనా ఫైనల్ మ్యాచ్ లో టోర్నమెంట్ విజేతగా సారలమ్మ తల్లి టీం గెలిచింది.విజేతలకు దేవరబాల ఢిల్లీ సరోజిని, స్పోర్ట్స్ ఆఫీసర్ కొమరం వెంకటనారాయణ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్,పాయం బాబు చేతుల మీదుగా నగదు,బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,గ్రామ యువత,ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 32