బంగారు గుండ్లు దొంగిలించిన ఇద్దరిని అరెస్టు చేసిన రామాయంపేట పోలీసులు
రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 24:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఈ నెల 22.01.2025 నాడు మధ్యాహ్నం అందజా 1.00 గంటల సమయంలో వృదురాలు అగు జంగంపల్లి బీరవ్వ భర్త మల్లయ్య వయస్సు (75) సంవత్సరాలు కులం కుర్మ గ్రామం తోనిగండ్ల చెందిన ఆమె సిద్దిపేట X రోడ్డు వద్ద ఒక్కతే ఉండగా పోచమైన సుధాకర్ తండ్రి చంద్రయ్య మరియు మెట్టు విజయ్ తండ్రి నర్సింలు ఇద్దరు గ్రామం రామాయంపేట అనూ వారు వృద్ధురాలికి మాయమాటలు చెప్పి ఆమె హాస్పిటల్ వెళ్తున్నానని అంటే తీసుకొని వెళ్లి హాస్పిటల్ నందు మందు గోళీలు ఇప్పించి హాస్పిటల్ బయటికి రాగానే ఆమె ఒంటిపై ఉన్న బంగారు గుoడ్లు దొంగిలించుకొని వెళ్లిపోగా ఈరోజు నిందితులు దొరకగా వారిని అరెస్టు చేసి రిమాండ్ చేసి మెదక్ కోర్టుకు పంపడం జరిగిందని రామాయంపేట ఎస్సై బాలరాజ్ విలేకరులకు తెలిపారు.