■ పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నామాల ఆజాద్
★ఖమ్మం నగర ముఖ్యుల సమావేశం
నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శ్రద్ధ వహించాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ తెలిపారు.స్థానిక రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పి డి ఎస్ యు నగర ముఖ్యుల సమావేశంలో వారు ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నటువంటి యూనివర్సిటీ సమస్యను కనీసం అసెంబ్లీలో గాని క్యాబినెట్ సమావేశంలో కానీ మాట్లాడకపోవడం జిల్లా ప్రజానీకాన్ని నిర్లక్ష్యం వహించడమేనన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఇంకా జిల్లా లో JNTU మెడికల్ కాలేజీ నిర్మాణంలో నిర్వీర్యం అవుతున్న పరిస్థితి ఉన్న జిల్లా మంత్రులు స్పందించి క పోవడం ఏమిటని వారిని ప్రశ్నించారు. గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల అద్దె భవనాల్లో నడుస్తూ హత్యలు చెల్లించకపోవడం వల్ల గురుకులాలకు తాళాలు వేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది అన్నారు. గురుకులాలలో చదివే విద్యార్థులు అద్దె భవనాలలో సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఏలుకలు కరిచి ఆసుపత్రుల పాలైన కనీసం మంత్రులు పరామర్శించినటువంటి దాఖలాలు లేకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే జిల్లాకు నిధుల కేటాయించి సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ధ వహించాలన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో జిల్లా విద్యారంగ సమస్యలతో పాటు యూనివర్సిటీ సాధన కోసం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో పీడీ ఎస్ యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేష్, జిల్లా నాయకులు వినయ్, పృథ్వి, సాదిక్, సందీప్, అశోక్, నసీర్, వరుణ్, మణికంఠ, రూత్విక్ తదితరులు పాల్గొన్నారు.