రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా శనివారం రోజు బ్లాక్ లెవెల్లో ఫుట్బాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని యువజ్యోతి స్పోర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ టోర్నమెంట్ లో మెదక్ జట్టుపై యువజ్యోతి జట్టు క్రీడాకారులు గెలుపొందిన వారికి రామాయంపేట ఫుట్బాల్ టీంకు పిఎన్ఆర్ సోషల్ సర్వీస్ మరియు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు ఆర్థికంగా సహాయం అందజేసి గెలిచిన జట్టుకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువ జ్యోతి స్పోర్ట్ క్లబ్ నిర్వాహకులు బొంతల సత్యనారాయణ,పట్టణ ముదిరాజ్ నాయకులు పోచమ్మల గణేష్, డాక్టర్ సతీష్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Post Views: 46