25.01.25 న ములుగు జిల్లా SP శభరిష్ P. IPS గారి పర్యవేక్షణలో ప్రభుత్వ నిషేదిత సి.పి.ఐ మావోయిస్టు పార్టీకి చెందిన భద్రాద్రి కొత్తగూడెం “అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీకి చెందిన మణుగూరు ఏరియా కమిటీలోని మణుగూరు LGS లో పనిచేసినటువంటి చత్తీస్గఢ్ రాష్ట్రం, ఉసూర్ PS పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన పార్టీ సభ్యురాలు మడవి మంగ్లీ నవ్య వయసు: 26సం: శ్రీ గీత మహేష్ బాబాసాహెబ్, OSD ములుగు ఎదుట లొంగిపోవడం జరిగింది…
లొంగిపోయిన మడవి మంగ్లీ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. మిల్లంపేట గ్రామం దండకారణ్యంలో ఉండటం వలన కౌరుగుట్ట గ్రామానికి చెందిన బోటీ అనే మిలిషియా కమాండర్ ప్రోత్సాహంతో ఈమె మిలీషియా సభ్యురాలిగా పార్టీలో చేరి 2018 జనవరి నుండి 2019 జులై వరకు అక్కడ మిలీషియా సభ్యురాలిగా పనిచేయటం జరిగింది. తర్వాత 2019 సెప్టెంబర్ నెలలో అప్పటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ అయినటువంటి యాప నారాయణ • హరి భూషణ్ గార్డ్ అయినటువంటి వందు శీను ప్రోత్సాహంతో ఈమె మణుగూరు LGS లో చేరి కుంజు వీరయ్య లచ్చన్న ఆధ్వర్యంలో పనిచేసింది.
పార్టీలో పని చేసే సమయంలో 2023 సంత్సరంలో ఏస్టల్ 08 రాజేష్ అనే చర్ల దళ కమాండర్ ని పార్టీ అనుమతితో వివాహం చేసుకొన్నది. ఇతను అదే సంవత్సరం మే లో పుట్టపాడు ఆటనీ ప్రాతంలో జరిగిన పోలీస్ ఎదురుకాల్పులలో రాజేష్ మరియు దేవాళ్ అనే దళ సభ్యుడు చనిపోయారు.
2024 సెప్టెంబర్ నెలలో ఈమె పని చేసే మణుగూరు LGS ఇంచార్జి కుంజా వీరయ్య లచ్చన్న మరియు అతని బృందం కర్కగూడెం అటవీ ప్రాంతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వద్ద జరిగిన పోలీస్ ఎదురు కాల్పులలో చనిపోవడం జరిగింది. ఆ సమయంలో ఈమే ఛత్తీస్గఢ్ రాష్ట్రములో ఉంది.
ఈమె పార్టీలో పనిచేసినటువంటి సమయంలో ఈ క్రింది ఘటనలలో పాల్గొన్నది:
2018 మార్చ్ నెలలో పుసుగుప్ప గ్రామానికి చెందిన భరత్, చిన్న ఉట్టపల్లికి చెందిన రఘు ఇద్దరినీ పోలీస్ ఇన్ఫార్మర్స్ అని హత్య చేసిన ఘటనలో పాల్గొన్నది.
20121 ఏప్రిల్ నెలలో బీజపూర్ జిల్లా టేకులగుర్మా గ్రామం వద్ద మావోయిస్టులు మాటు వేసి పోలీసుల పై దాడి చేసిన ఘటనలో పాల్గొన్నది. ఈ ఘటనలో బీజాపూర్ కి చెందిన DRG, CRPF 24 మంది పోలీసులు చనిపోయినారు. తరువాత వారి వద్ద ఉన్న ఆయుధాలు ఆపహారించడం జరిగింది.
ప్రస్తుత సమాజంలో సిపిఐ (మావోయిస్ట్) పార్టీ సిద్ధాంతాలకు చోటులేదు అని, అది గమ్యం లేని అర్థరహిత పోరాటంగా భావించి తని కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని భావించి ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది.
ఈ సందర్భంగా అజ్ఞాతం లో పనిచేస్తున్న మిగతా మావోయిస్ట్ పార్టీ నాయకులు మరియు పార్టీ సభ్యులు ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. లొంగిపోయిన వారికి రివార్డ్ తో పాటు, ప్రభుత్వపరంగా పునరావాసం కలిపించి, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని శ్రీయుతి గౌరవనీయులైన ములుగు జిల్లా. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డా. శబరీష్ P, IPS గారు తెలియజేశారు.