◆జాతరకు సానుకూలంగా స్పందించిన గవర్నర్
నేటి గదర్ కరకగూడెం:చారిత్రిక నేపథ్యం, ఆధారాలు కలిగిన సమ్మక్క తల్లి చిరుమళ్ళ క్షేత్రంలో జరిగే సమ్మక్క -పగిడిద్దరాజు ల కళ్యాణం, కోయతుర్ ఇంటివేల్పుల సమ్మేళనాన్ని రెండేళ్లకు ఒక సారి నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ను ఆలయ కమిటీ సభ్యులు చుంచు రామకృష్ణ, చందా బిక్షపతి కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. గవర్నర్ కు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు సంస్కృతి సంప్రదాయాలు చరిత్రను వివరించారు. ప్రభుత్వం జాతరకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ. ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగిన జాతరకు కావలసిన ఏర్పాట్లు, వేల్పుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని, వీలు చూసుకుని జాతరకు వస్తానని తెలిపారు. ఆదివాసి సంప్రదాయాలు సంస్కృతిని అందరం కాపాడుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలా కమిటీ సభ్యులు ప్రొఫెసర్ గొంది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.