నేటి గద్దర్ న్యూస్ ✍️.చింతకాని ప్రతినిధి పిచ్చయ్య
ఈరోజు ఉదయం జరిగిన ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి *పొంగులేటి శ్రీనివాసరెడ్డి*, ఖమ్మం పార్లమెంటు సభ్యులు *రామసహాయం రఘురాం రెడ్డి* సూచనల మేరకు ఖమ్మం లోని ప్రభుత్వ హాస్పిటల్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా.కోట రాంబాబుTAC సభ్యులు ఉమ్మినేని కృష్ణతో కలిసి పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరినీ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్తితి వివరాలు తెలుసుకొని రిపోర్ట్ అన్ని పరిశీలించి సంబంధిత వైద్యులతో మరియు హాస్పిటల్ సూపర్న్డింట్ తో చరవాణిలో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి అని కోరారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి మృతుల కుటుంబాలకు మరియు గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటది అని వారు తెలిపారు.
Post Views: 68