◆పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ శేరి.సుభాష్ రెడ్డి
మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి జనవరి 31.
శుక్రవారం నాడు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఇటీవల పదవి కాలం ముగిసిన మెదక్ మున్సిపల్ చైర్మన్లను, వైస్ చైర్మన్ లను అనగా
మెదక్ తాజా మాజీ వైస్ చైర్మన్, మల్లికార్జున్ గౌడ్, రామాయంపేట తాజా మాజీ చైర్మన్ పల్లె. జితేందర్ గౌడ్,తూప్రాన్ రవీందర్ గౌడ్, నర్సాపూర్ అశోక్ గౌడ్ లను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే శ్రీ. కేటీఆర్, శాలువాతో మెమొంటోను అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ గత పది ఏళ్లలో మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ప్రజల ప్రక్షణ పోరాడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని రాబోయే స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జైడా ఎగరడం ఖాయమని అన్నారు. 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా ఎంతోగాను అభివృద్ధి చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి అర్హులకు అందేలా చేస్తామన్నారు.