చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
ఓ అద్భుతమైన సంఘటన చర్ల మండలం – తేగడ గ్రామానికి చెందిన శ్రీ సరస్వతి విద్యానికేతన్ విద్యార్థుల దాతృత్వం….
చిన్న వయస్సు నుంచే విద్యార్థులలో మానవత్వాన్ని పెంపొందించాలనీ, ప్రక్క వారికి తోచిన సాయమదించాలనే ఓ మహా సంకల్పానికి తెర లేపారు సరస్వతి విద్యానికేతన్ చైర్మన్ శ్రీమతి లిఖిత టీచర్… విద్యార్థినీ విద్యార్థులలో ఈ విషయం నాటుకుపోవాలనే ఉద్దేశంతో, జనవరి ఒకటో తేదీన ఓ డొనేషన్ బాక్స్ ను పాఠశాలలో ఏర్పాటు చేసి – విద్యార్థులందరి చేత అందులో సేవింగ్స్ ను చేర్చి… సేకరించిన 1520/- రూపాయలను ఈరోజు ఉదయం 11. 30 గంటలకు మీకోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు వితరణగా అందజేయడం జరిగింది.ఇలా చేయడానికి ప్రోత్సాహించిన సరస్వతి విద్యానికేతన్ మేనేజ్మెంట్ కు, అధ్యాపక బృందంకు మరియు చిన్నారులందరికీ మేమున్నాం టీం ఛైర్మెన్ లయన్ నీలి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సరస్వతి విద్యానికేతన్ – తేగడ వారు స్వంత ఆలోచనలతో రూపొందించిన 2025 క్యాలెండరు ను చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ ఆవిష్కరించడం జరిగింది.