★1/70 చట్టానికి వ్యతిరేకంగా కబ్జా కి గురవుతున్న ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ భూములను కాపాడండి
★ అక్రమార్కులపై చర్యలు తీసుకోండి
★ఏవీఎస్పీ డిమాండ్
నేటి గదర్ న్యూస్,దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారని ఏవీఎస్పీ ఆరోపించింది.ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర దుమ్మగూడెం మండల తాసిల్దార్ ఆఫీస్ లో మాట్లాడుతూ …
1/70 చట్టానికి వ్యతిరేకంగా కబ్జా కి గురవుతున్న ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏవీఎస్పీ డిమాండ్ చేసింది. 1/70 చట్టానికి వ్యతిరేకంగా ములకపాడు పంచాయతీ పరిధిలో లక్ష్మీ నాగారం పంచాయతీ పరిధిలో కొందరి గిరిజనేతర్ల కబ్జాకి ప్రభుత్వ భూములు ప్రభుత్వ స్థలాలు అక్రమణానికి గురవుతున్నాయని వాటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకొని ఎ ల్ టి ఆర్ కేసులు నమోదు చేయాలని మండలంలో జాతీయ రహదారి పరిధిలో ఉన్నటువంటి వివిధ పంచాయతీ లలో అనార్హుల అక్రమనకు గురైన ప్రభుత్వ స్థలాలను భూములను ప్రభుత్వం అధినంలోకి తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ చట్టాలను కాపాడే దిశగా మండల అధికారులు శ్రద్ధ చూపాలని అనుమతులు లేని వ్యాపారాలు కూడా కొందరు అనర్హులు సాగిస్తున్నారని అదేవిధంగా బహుళ అంతస్తులు కడుతున్న వాటిపై చూసి చూడనట్టు అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు . అట్టి అక్రమాలపై చర్యలు తీసుకుని ఎడల ఉన్నత అధికారులను ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో నాయకులు పూనం రామ్మూర్తి తెల్లం నారాయణ కోటి బాబురావు తదితరులు పాల్గొన్నారు.