★గోడపత్రికలను ఆవిష్కరించిన
తెలంగాణ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ అందె భాస్కర్ మాదిగ .
సిద్దిపేట జిల్లా న్యూస్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం నాడు కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 07 న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించ తలపెట్టిన వెయ్యి గొంతులు లక్ష డప్పులు మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గంలోని మాదిగలంతా పార్టీలకు సంఘాలకు అతీతంగా తరలి రావాలని లక్ష డప్పుల పోగ్రాం రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ అందె భాస్కర్ మాదిగ పిలుపునిచ్చారు.ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ కేంద్రం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శన వాల్ పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది.ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ సీనియర్ నాయకులు మాసపాక కనకయ్య మాదిగ ,దమ్మని మల్లయ్య మాదిగ, ఎం ఎస్ పి రాష్ట్ర నాయకుడు మైస రాములు మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముం డ్రాతి కృష్ణ మాదిగ, సీనియర్ నేత కర్రోల్ల కనకయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఉబ్బాని ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మని మహేష్,గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ శనిగిరి రమేష్ ,నాయకులు బుడిగే మహేష్, బొంది స్వామి,సల్ల శ్రీనివాస్, రాజు,కిషన్,నవీన్, బాలు,శేఖర్,మల్లేష్,ప్రసాద్,రవి,శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.