◆పామాయిల్ చెట్టు మీద నుంచి జారీ పడి చనిపోయిన పామాయిల్ కూలి
◆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి
◆గెలలు కోసే కూలీలకు చట్టబద్రత కల్పించాలి
నేటి గదర్ న్యూస్,ములకలపల్లి ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమేదార్ బంజర్ గ్రామంలో పామాయిల్ తోటలో కూలి పనికి వెళ్లి చెట్టు మీద నుంచి జారిపడి చనిపోయిన మోడీయం రాంబాబు మృతదేహానికి తంబళ్ల రవి నివాళులర్పించారు,వారు మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు పదివేల మందికి పైనే పామాయిల్ గెలలు కూలీలు ఉన్నారని,గెలలు కోసే కూలీలు చాలా మంది చెట్లు మీద నుంచి పడి చనిపోవడం మరియు తీవ్ర గాయాలు(కాళ్లు, చేతులు విరిగి)ఆర్థిక ఊబిలో కురక పోతు ఉన్నారని,అశ్వరావుపేట నియోజకవర్గంలో రెండు పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్న కూడా గెలలు కోసే కూలిలకు ప్రభుత్వం తరఫునుంచి ఏలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం…?ప్రభుత్వం తరఫు నుంచి కార్మికులకు ఎలాంటి గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరమని,ఈరోజు మరణించిన మోడీయం రాంబాబు కి ఇద్దరు పిల్లలు ఇటీవలె తల్లి మరణించినది వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి డిమాండ్ చేశారు.