రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 1:- వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి నూతన సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకున్నప్పుడే రైతులకు అధిక ఆదాయం కలుగుతున్నదని వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు రాజ్ నారాయణ అన్నారు.మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక సహకార సంఘం నందు ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇఫ్ఫ్కో సంస్థ సుమారు 18 లక్షల విలువ చేసే డ్రోన్ మరియు ట్రాలీ ఆటోను ప్రాథమిక సహకార సంఘానికి ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు.వ్యవసాయ శాఖ అధికారుల ప్రత్యేక చొరవతో ప్రాథమిక సహకార సంఘం సహకారంతో రామాయంపేట మండలం శివాయపల్లి గ్రామానికి చెందిన యువరైతు శ్రీకాంత్ కు ఇఫ్ఫ్కో సంస్థ ద్వారా డ్రోన్ పైలెట్ పై శిక్షణ ఇప్పించామన్నారు. అలాగే మండల పరిసర ప్రాంతాల్లో రైతుల పొలాల్లో పురుగుమందులు తెగులు మందులు ద్వారా పిచికారి చేయడానికి నియమించడం జరిగిందన్నారు.ర్రైతులు తెగులు మరియు పురుగుమందుల నివారణ కోసం పిచికారి చేసే సమయంలో పురుగు మందుల విష ప్రభావం వల్ల రైతుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అదేవిధంగా పురుగుమందుల మరియు తెగులు మందుల పిచికారి మోతాదుకు మించి వాడడం ద్వారా వాతావరణ కాలుష్యం మరియు నేల కాలుష్యం నీటి కాలుష్యం జరుగుతుందన్నారు. పిచికారి కోసం ఒక మగ కూలి ఇద్దరు ఆడకూలీలు ప్రతిసారి అవసరం పడతాయి.ప్రస్తుతం కూలీల కొరత మరియు రైతు యొక్క శ్రమ సమయం దృష్టిలో ఉంచుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అయినటువంటి డ్రోన్ ద్వారా పురుగుమందుల తెగులు మందుల పిచికారిని రైతులు అలవర్చుకోవాలని దీని ద్వారా తమ విలువైనటువంటి సమయం శ్రమ ఆదా అవుతుందని సూచించడం జరిగిందన్నారు.మెదక్ జిల్లాలోనే ప్రధమంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రామాయంపేట ద్వారా ఈ డ్రోన్ ద్వారా రైతులకు సేవలందించే అవకాశం కల్పించిందని ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రం ఇఫ్కో సంస్థ మేనేజర్ చంద్రబాబు నాయుడు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు సందీప్,సాయి కృష్ణ,సందీప్,ప్రవీణ్ సీఈవో నర్సింలు రైతులు పాల్గొన్నారు.
