రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 1:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాల్గవ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాపు యాదగిరితో పాటు పలువురు కౌన్సిలర్లు శనివారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీని గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీలో తాము ఉండి గెలిచి తాము పట్టణ అభివృద్ధి చేయలేదని తెలిపారు.అదేవిధంగా తాను 2019 నుండి వ్యక్తిగతంగా సొంత నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వెజ్ నాన్ వెజ్,వైకుంఠధామం,సీసీ రోడ్ల పనులు చేయడం జరిగిందన్నారు.అలాగే మున్సిపాలిటీలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు డ్రైనేజి లాంటి అభివృద్ధి పనులు చేయడానికి తాము చేరుతున్నట్లు తెలిపారు.అనంతరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాపు యాదగిరి మాట్లాడుతూ 2021 నుండి రామాయంపేట మున్సిపాలిటీ ప్రాంతం అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందన్నారు.రామాయంపేట డివిజన్ ఇప్పటి వరకు పూర్తి కాలేదని కేవలం గెజిట్ మాత్రమే ఇచ్చారని తెలిపారు.మున్సిపాలిటీ పట్టణం అభివృద్దే ధ్యేయంగా తాము బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు పేర్కొన్నారు.మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు,మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో తాము కాంగ్రెస్ పార్టీకి తమ వంతు శాయశక్తుల పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు.
