రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 1:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని శనివారం నాడు మెదక్ ఆర్డిఓ రమాదేవి సందర్శించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో పోలింగ్ స్టేషన్లకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సుల విషయంపై ఆమె ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మండల సిబ్బందితో మాట్లాడారు.అదేవిధంగా ధరణిలో ఉన్న పెండింగ్ సమస్యలపై చర్చించి వాటిని త్వరలో పూర్తి చేయాలని ఆమె సిబ్బందికి సూచించారు.అలాగే కోనాపూర్ మరియు తొనిగండ్ల గ్రామాలలో భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ బిల్లులు త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అలాగే కుల ఆదాయద్పవ పత్రాలు పెండింగ్ లో ఉండకుండా వెంటనే జారీచేయాలని ఆమె సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రజనీ కుమారి,ఆర్ఐ గౌసోద్దీన్,గోపి మండల సిబ్బంది పాల్గొన్నారు.
