నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి
హైదరాబాద్ అసెంబ్లీ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫేసిలో వారిని కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో దేశంలో ఏ రాష్ట్రం చేయలేని బృహత్కర కార్యక్రమాన్ని బీసీ కుల గణనను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీల పక్ష పార్టీగా బీసీల పక్షాన ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీరు హర్షణీయం అదే విధంగా సమాజంలో వెనకబడిన వర్గం ఎన్నో సంవత్సరాల కల ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈరోజు వారి అభ్యున్నతి కొరకు విద్య ఉద్యోగం ఆర్థికంగా మెరుగుపడాలని వారి వాటాను వారి కేటాయించాలని ఇలాంటి బృహత్కర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ సహాచర ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసినాము.