రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 5:- మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి జిల్లా అధ్యక్షుడు వాలదాస్ మల్లేష్ గౌడ్ నూతనంగా ఎన్నికైన శుభ సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని అయన స్వగృహంలో బుధవారం రోజు రామాయంపేట భారతీయ జనతా పార్టీ నాయకులు ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అయనకు ప్రత్యేక అభినందలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల అధ్యక్షులు నవీన్ గౌడ్,పట్టణ బిజెపి సీనియర్ నాయకులు జె.శంకర్ గౌడ్,బండారి ఎల్లం గౌడ్,కటికె కార్తీక్,వొలిస సతీష్ రావు లు పాల్గొన్నారు.
Post Views: 72