రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 7:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త కల్వల లచ్చయ్య కుమార్తె నిరుపేద వధువు వివాహానికి మెదక్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆ గ్రామానికి చెందిన రైతుబంధు మండల మాజీ అధ్యక్షులు బానప్పగారి నర్సారెడ్డి ఆధ్వర్యంలో 5000/- రూపాయలు వివాహ మండపంలో అందజేసి మానవత్వం చాటుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు దిద్దిరాజు.రవీందర్ రెడ్డి సంజీవరెడ్డి,సంతోష్ రెడ్డి ఎర్ర దుర్గం.పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 117