నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. మాత రమాబాయి అంబేద్కర్ మహిళలకు ఆదర్శమూర్తి అని మహిళ ప్రాంగణపు అధికారి వేల్పుల విజేత కొనియాడారు. శుక్రవారం వీరనారీమణుల ఆశయ సాధన సమితి కార్యాలయ ఆవరణలో మాత రమాబాయి జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వీరనారి మణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో మాత రమాబాయి జయంతిని పురస్కరించుకొని , ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రమాబాయి సేవలను కొనియాడారు. మాత రమాబాయి తో పాటు ఇతర వీర నారి మణుల చిత్రపటాలకు కూడా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేత మాట్లాడుతూ తన భర్త డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా మారే ప్రక్రియలో నిరంతరం ప్రోత్సాహం అందించిన రమాబాయి ధన్యజీవురాలని పేర్కొన్నారు. తన జీవితంలో అత్యధిక సంతానాన్ని కోల్పోయిన , నిరంతరం పేదరికం అనుభవిస్తూ కూడా తన భర్త అంబేద్కర్ ఉన్నతికి అనుక్షణం పాటుపడిన రమాబాయి జీవితం నుండి మనం ఎంతో పూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ సీఐ పొల్లూరు నాగయ్య , తెలంగాణ ఉద్యమకారుడు పాలకుర్తి కృష్ణ , వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి , లీగల్ అడ్వైజర్ షేక్. నజీమా , జిల్లా ఉపాధ్యక్షురాలు త్రివేణి , కార్యదర్శి స్పందన , సహాయ కార్యదర్శి కృష్ణవేణి నాయకులు విజయ ,ఝాన్సీ ,నాగమణి ,నాగేంద్ర, సంధ్య ,సుభద్ర ,భవాని, కవిత , సుశీల, లక్ష్మి ,లలిత ,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు రవీంద్ర నాయక్ ,అఖిల్, రామ్మూర్తి, నాగేశ్వరావు ,సంజీవరావు, జగదీష్ , గాయకుడు ఫక్రుద్దీన్ , రావుల వెంకట్ , ప్రకాష్ , వీరన్న తదితరులు పాల్గొన్నారు.
