నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి
తల్లాడ మండలంలోని విశ్వబ్రాహ్మణ మండల కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి స్థలదాత రెడ్డెం వీర మోహన్ రెడ్డి మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఆస్థాన పండితులు రామడుగు నరసింహ చారి విచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ విశ్వా న్ని శాసించిన విశ్వకర్మ కాలజ్ఞాన రచన కర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహావిష్కరణ ఎంతో మనోతనమైంది అని ఈ కులంలో పుట్టిన మనం ఎంతో అదృష్టవంతులము అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రుద్రాక్ష నరసింహ చారి, ప్రధాన కార్యదర్శి తాటికొండ కృష్ణ,కోశాధికారి గంటల వెంకటాచారి,ఉపాధ్యక్షులు ఇందు రవి, జాయింట్ సెక్రెటరీ సంబోజు పరిపూర్ణాచారి,వ్యవస్థాపక అధ్యక్షులు బాజోజు శేష భూషణం,గౌరవ సలహాదారులు ఇందోజు బ్రహ్మయ్య, బండారు వీరబ్రహ్మం,తాటికొండ సత్యనారాయణ, కొక్కొండ సత్యం, కొక్కొండ నరసింహ చారి,కొక్కొండ వీరభద్రా చారి,సుబ్రమణ్యం,కొక్కొండ వాసు, బండారు భాస్కర్,మల్లెల వెంకట చారి,మహిళ సంయుక్త కార్యదర్శి తాటికొండ పద్మావతి, కత్తరోజు సునీత తదితర విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.