రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 10:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో గొల్ల కుర్మ యాదవుల ఆరాధ్య దైవం అయినటువంటి మల్లికార్జున స్వామి 33వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాదవ సంఘ సభ్యులు మాట్లాడుతూ మల్లన్న స్వామిని స్మరించుకుంటూ ప్రతి ఏటా మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు.ఉత్సవాలలో భాగంగా మల్లన్న స్వామి కళ్యాణం,గంపల ఊరేగింపు,అగ్నిగుండాల తొక్కుట కార్యక్రమం చేపట్టామన్నారు.అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం సంఘ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టామన్నారు.ఆ మల్లికార్జున స్వామివారి కృపతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. సాయంకాల సమయంలో బండ్లు తిరుగుట కార్యక్రమం చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘ సభ్యులు పాతింటి మల్లయ్య, బక్కనోళ్ల ఎల్లయ్య,నేరెళ్ల ఎల్లయ్య,గుర్రం యాదయ్య, ముష్టి శ్రీశైలం,ముష్టి మురళి యాదవ్,బస కొమురయ్య,నేరోళ్ల కిష్టయ్య,నేరోళ్ల రమేష్,బస కుమార్,బక్కనోళ్ల బాలరాజ్ యాదవ్,గురం శంకర్,బక్కనోళ్ల కుమార్ యాదవ్,ముష్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
