రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 10:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో జరుగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు గొర్రెల పెంపకం దారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ సోమవారం నాడు విచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయంలో స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలతో ప్రజలందరూ చల్లగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ యాదవ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 120









