రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 10:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం నాడు హాజరై శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని అయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు.మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, రైతులు పాడిపంటలతో పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఎల్లప్పుడూ ఉండాలని తాను స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 272