టేకులపల్లి మండలం లో జరిగిన మీడియా సమావేశం లో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా జడ్పీటీసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించే విదంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలనీ సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ డిమాండ్ చేశారు స్వతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలు అవుతున్న గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ విషయం లో అన్యాయం జరుగుతూనే ఉంది అని మండిపడ్డారు తెలంగాణ రాష్టంలో కొత్త జిల్లాలు ఏర్పడి 11 సంవత్సరాలు అవుతున్న రిజర్వేషన్ పక్కడబందిగా అమలు చేయలేదు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు అత్యధికముగా ఉన్న జిల్లాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసి, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు 10 శాతం రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేశి గిరిజన లంబాడి బిడ్డలకు న్యాయం చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు.
