విద్యార్థిని అభినందించిన మాసాయిపేట ఉపాధ్యాయులు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం నేటి గద్దర్ ఫిబ్రవరి 11.
ఫిబ్రవరి 13 నుండి 16 వరకు మహారాష్ట్ర లోని ఛత్రపతి శివాజీ సంభాజి నగర్ ,ఔరంగాబాద్ లో జరిగే 68 వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 14 బాలికల సాప్ట్ బాల్ చాంపియన్షిప్ లో పాల్గొనే తెలంగాణ జట్టు కు మెదక్ జిల్లా మాసాయిపేట ఉన్నత పాఠశాల లో 9 వ తరగతి చదువుతున్న కే అక్షిత ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మ పురి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ
గత నెల తూప్రాన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో మెదక్ జిల్లా బాలికల జట్టు కు ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి తుది జట్టు కు ఎంపికైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల లో జరిగిన కార్యక్రమం లో అక్షిత ను ధర్మ పురి ,ఉపాద్యాయులు మరియు వ్యాయామ ఉపాద్యాయులు శ్యాం సుందర్ శర్మ లు అభినందించారు.