నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. షెడ్యూల్డు కులాల (SC) వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ కలిశారు.
కమిషన్ చేసిన సిఫారసుల్లో క్రీమీలేయర్ ప్రతిపాదనను తిరస్కరించి, మిగతా వర్గీకరణ ప్రతిపాదనలను శాసనసభ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మాదిగ ఉపకులాల ప్రతినిధులు ఉన్నారు.
Post Views: 96