నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి.
జూలూరుపాడు : మండలంలోని అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వసం కోల్పోయి నిరాశ్రులైయిన సాయిరాం తాండా కు చెందిన గూగులోత్ వీరు కుటుంబాన్ని ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొండపాటి శ్రీనివాస్ (వాసు)పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. వీరు కుటుంబానికి బియ్యం,నిత్యావసర సరుకులు, కూరగాయలు ,నగదు ను అందించారు.బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల నరసింహారావు,నర్వినేని పుల్లా రావు,మాజీ ఎంపీటీసీ బానోత్ రాంజీ,మాడుగుల నాగరాజు, దినేష్,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 131









