*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండలంలోని రోళ్లగడ్డ, గుండాల, చిన్న వెంకటాపురం, నరసాపురం తండ, ప్రాంతాలలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన వాల్ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఎక్కువగా మావోయిస్టులు మాత్రమే పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతుంటారు. అయితే తాజాగా వెలసిన పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ట్రైబల్ యూత్ అసోసియేషన్ పేరుతో ఉండటం గమనార్హం.శాంతియుత జీవనం మన హక్కు అనుమానితుల సమాచారం ఇద్దాం. పోలీసులకు సహకరిద్దాం. మావోయిస్టులు వద్దు అభివృద్ధి ముద్దు అని మండలంలో అక్కడక్కడ తెలంగాణ ట్రైబల్ యూత్ అసోసియేషన్ పేరుతో వాల్ పోస్టర్లను మంగళవారం రాత్రి అతికించారు.
Post Views: 126