– మావోయిస్టులు వద్దు – అభివృద్ధే ముద్దు, శాంతియుత జీవనమే మన జీవన హక్కు అంటూ పోస్టర్లు.
——————————
మండలంలోని గుత్తికోయ వలస ఆదివాసి గ్రామాలైన మల్లారం మద్దులగూడెం ఎర్రకుంట చింతలపాడు సుందరయ్య నగర్ తో పాటు పలు ప్రాంతాలలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన వాల్ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. తాజాగా వెలసిన పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ట్రైబల్ యూత్ అసోసియేషన్ పేరుతో ఉండటం గమనార్హం. “శాంతియుత జీవనం మన హక్కు” “అనుమానితుల సమాచారం ఇద్దాం – పోలీసులకు సహకరిద్దాం” “మావోయిస్టులు వద్దు – అభివృద్ధి ముద్దు” అంటూ పేర్కొన్న పోస్టర్లు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం దర్శనమిచ్చాయి. అయితే ఈ పోస్టర్లు ‘తెలంగాణ ట్రైబల్ యూత్ అసోసియేషన్’ పేరుతో వెలవడంతో మండలం లో సంచలన చర్చనీయాంశం గా మారింది. ఇన్నాళ్ళు గుంభనంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో పోస్టర్లు వెలవడంతో వలస ఆదివాసి గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
