★అంతుపట్టని వైర్సతో కోళ్లు మృతి
★రూ.లక్షల్లో నష్టపోతున్న యజమానులు
★ ఆంధ్ర కోళ్ల వైరస్ తెలంగాణ కోళ్లకి సోకిందా?
★ బార్డర్ చెక్ పోస్టులలో నామమాత్రపు తనిఖీలు
★ అధికారులు ఇకనైనా నిద్రమత్తు వీడాలి
నేటి గదర్ న్యూస్,పినపాక:అంతుపట్టని వైరస్ దెబ్బకు ఖమ్మం జిల్లాలో.. నాటు, బ్రాయిలర్ కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఉదయం ఒక్క కోడికి వైరస్ సోకిందంటే చాలు.. సా యంత్రానికి ఆ షెడ్డులో ఉన్న వేలాది కోళ్లు ప్రాణా లు కోల్పోతున్నాయి దీంతో ఫారాల యజమానులు ఈ సీజన్లో తీవ్రసాయిలో నషాలు చవిచూసున్నారు. ఆంధ్ర కోళ్ళకి చూపిన వైరస్ తెలంగాణ కోళ్లకు కూడా సోకిందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన వేలాది కోళ్లు తెలియని వైరస్ తో మృతి చెందాయి. బాధిత రైతు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపతిరావుపేట సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రైతు తాతిని సుబ్బారావు గత కొన్ని నెలల క్రితం ఓ కంపెనీకి చెందిన సుమారు 3వేల బాయిలర్ కోడి పిల్లలను తెచ్చి క్రాప్ వేయడం జరిగింది. తీరా చేతికి వచ్చే సమయానికి గత మూడు రోజుల నుంచి వాటికి తెలియని వైరస్ సోకి మృతి చెందినట్లు రోదిస్తూ తెలిపారు. కోళ్ల పెంపకానికి సంబంధించి ఇప్పటికే పెట్టుబడి లక్షల్లో పెట్టడం జరిగిందని రైతు తెలిపారు. మృతి చెందిన కోళ్ల విలువ రు.5లక్షలు ఉంటుంది అని రైతు సుబ్బారావు నేటి గదర్ డిజిటల్ న్యూస్ కి తెలిపారు. కోళ్ల మృతితో సర్వం కోల్పోయానని తీవ్ర అప్పుల ఊబిలో కురుకున్నానని రైతు ఆవేదన వెలుబు ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకుంటే తమ కుటుంబం వీధిన పడుతుందని రోధిస్తూ చెప్పారు.
★ఆంధ్ర బోర్డర్ చెక్ పోస్టు ల వద్ద నియంత్రణ ఏది?
ఆంధ్ర లో కోళ్ళకి వైరస్ సోకిన విషయం విధితమే. కానీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ వైరస్ తెలంగాణకి పాకింది. అక్కడ అనేక కోళ్లు మృతి చెందుతున్నప్పటికిని ఆంధ్ర బోర్డర్ చెక్పోస్ట్ ల వద్ద అధికారులు నిద్రమత్తులో ఉండడంతో కొంతమందితెలంగాణ వ్యాపారస్తులు అక్కడి కోళ్లను తెలంగాణకి తీసుకురావడం జరిగింది. దీనితో ఆ వైరస్ తెలంగాణకి కూడా వ్యాప్తి చెందినట్లు పలువురు కోళ్ల ఫారం రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెక్ పోస్ట్ ల వద్ద అధికారులు ఇప్పటికైనా తనిఖీలు విస్తృతంగా చేపట్టాలని పలువురు కోరుతున్నారు.