.
సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
నేటి గదర్ న్యూస్ :ఏన్కూర్, మార్చ్ 6:ఎన్నికల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కొరకు సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల పది నుంచి గ్రామాల్లో సమస్యలపై సిపిఎం బృందం పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలతో పాటు ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు కొరకు సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 20న ఏన్కూరు మండల కేంద్రంలో భారీ ప్రదర్శన తాసిల్దార్ కార్యాలయం ముందు మహా ధర్నాకు సమస్యలతో బాధపడుతున్న ప్రజలందరూ పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. సిపిఎం మండల కమిటీ సమావేశం గురువారం మండల కమిటీ సభ్యులు షేక్ జానీ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భూక్యా వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు తగిన స్థాయిలో నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల తో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదని తెలిపారు. ఇప్పటికి రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని రైతు భరోసా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపరించిందని అన్నారు. వితంతు , వృద్ధులకు, పెన్షన్లు మంజూరి కాలేదని, ఉన్న పెన్షన్ దార్లకు 4000, 6000 పెంచుతామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తు చేశారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రజాపాలన గ్రామసభలో పేర్లను ప్రకటించి పైలెట్ ప్రాజెక్టు గ్రామాల కే పథకాలు అములు పరిమితం చేయటం, మిగతా వారిని విస్మరించడం తగదని విమర్శించారు. అర్హులైన వారందరికీ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.సమస్యలతో బాధపడే ప్రజలందరూ సిపిఎం ఆధ్వర్యంలో జరిగే పోరాటాల్లో కలిసి రావాలని కోరారు. ఏజెన్సీ మండలం సమగ్ర అభివృద్ధికి తగిన స్థాయిలో నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. భూమిలేని పేదలందరికీ ఉపాధి హామీ పథకంతో సంబంధం లేకుండా 12000 రూపాయల ఇందిరామ ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి దొంతబయిన నాగేశ్వరావు మాట్లాడుతూ మండల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో ప్రణాళిక బద్ధంగా పరిష్కారం కోసం పోరాటాల రూపకల్పన చేశామని ప్రజలందరూ మద్దతుగా నిలబడి సమస్యల పరిష్కారాన్ని జరిగే పోరాటాలు కలిసి రావాలని కోరారు. సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య సంస్మరణ సభ ఈ నెల 9న సుజాతనగర్ లో జరుగుతుందని పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల సీనియర్ నాయకులు గుండా సత్యనారాయణ రెడ్డి ఏర్పుల రాములు, కాలసాని సాయికుమార్, భూక్యా లచ్చు నాయక్, నండూరి శ్రీనివాసరావు, అడపా శ్రీనివాసరావు,అంబల జయ,వరపాల రవి తదితరులు పాల్గొన్నారు.