నేటి గదర్ న్యూస్,
ఖమ్మం మార్చి 6 : ఈనెల 7 వ తేదీన వీరనారీ మణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని ” రాజ్యాంగం బహుజన మహిళలు సాధికారత ” అంశంపై ముందస్తుగా సదస్సు నిర్వహించనున్నట్లు సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి , లీగల్ అడ్వైజర్ షేక్. నజీమా , జిల్లా ఉపాధ్యక్షురాలు భూక్యా జ్యోతి , కార్యదర్శి చందు గురువారం ఒక ప్రకటనలు తెలిపారు. శుక్రవారం ఏడవ తేదీన పాత బస్టాండ్ సమీపంలోని హోటల్ శ్రీధర్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించనున్న ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళా మణులు హాజరవుతున్నారని తమ ప్రకటన లో తెలిపారు. రాజ్యాంగం _ బహుజన మహిళలు సాధికారత అంశంపై నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరై మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Post Views: 23