రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 7:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో అన్ని ప్రభుత్వ సంస్థలలో యూజ్ ప్లాస్టిక్ నిషేధించడానికి,నివారించడానికి ముందుగా మండల తహసిల్దార్ కార్యాలయంలో మండల సిబ్బంది, అధికారులు ప్లాస్టిక్ నిషేధించి స్టేయిన్లెస్ బాటిలను ఉపయోగించారు.ఈ సందర్భంగా శుక్రవారం నాడు మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలో మరియు సంస్థలలో తాగునీటి వినియోగం కోసం స్టెయిన్లెస్ స్టీల్ మరియు గ్లాస్ బాటిళ్లను ఉపయోగించాలని తెలిపారు.అదేవిధంగా తాగునీటి కోసం స్టెయిన్లెస్ స్టీల్ మరియు గ్లాస్ బాటిళ్లను ఉపయోగించే వ్యవస్థను ప్రోత్సహించాలని తెలిపారు.ఈ బాటిళ్లను ఉపయోగించడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అది అమలు చేయాలని తెలిపారు.అందుకే మండల స్థాయి గ్రామీణ స్థాయిలో మున్సిపాలిటీతో పాటు అన్ని విద్యా సంస్థలలో తాగునీటి కోసం స్టెయిన్లెస్ స్టీల్ మరియు గాజు బాటిళ్లను ఉపయోగించాలని వెల్లడించారు.
