రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 7:- విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కనెక్షన్ కోసం డబ్బులు కట్టి మూడేళ్లు గడిచినా తమకు ట్రాన్స్ ఫార్మర్ కనెక్షన్ ఇవ్వలేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.మల్లన్న సాగర్ భూమి కోల్పోయిన పోకల బాలరాజు అనే రైతు ఇటీవల రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సాగుభూమి కొనుగోలు చేశాడు.అందులో విద్యుత్ కనెక్షన్ కోసం లక్ష రూపాయలు విద్యుత్ అధికారులకు డీడీలు చెల్లించినప్పటికీ విద్యుత్ అధికారులు ఇప్పటివరకు కనెక్షన్ ఇవ్వడంలేదని లబోదిబోమంటున్నాడు.ఈ విషయంలో ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ ఫార్మర్ కు కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ అధికారులను వేడుకుంటున్నాడు.
Post Views: 46