+91 95819 05907

రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి

రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం లో చోటుచేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ఐ పి. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి.జవహర్ లాల్(50) సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజ్ గోపాల్ పేట గ్రామ శివారులోని ఫైరింగ్ రేంజ్ లో ఇన్ సర్వీస్ కానిస్టేబుల్స్ కు నిర్వహించిన ఫైర్ టెస్టింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి మేడ్చల్ కు కారులో వెళ్తున్నారు. మార్గమధ్యలో కుకునూర్ పల్లి మండలం చిన్నకిష్టాపూర్ చౌరస్తా వద్ద చిన్నకిష్టాపూర్ గ్రామం వైపు నుంచి వస్తున్న కారు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు తిప్పడంతో ఆ కారు ను తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న అడ్వటైజ్మెంట్ బోర్డు ను ఢీకొట్టింది.

కారు లో ఉన్న మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి. జవహర్ తలకు, ఛాతీలో గాయాలు గాక కారు డ్రైవర్ కాళ్లకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వారి వెనుకే వస్తున్న మేడ్చల్ పి టి సీ సిబ్బంది వారిని ములుగు మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామ శివారు లోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి జవహర్ లాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !